పిల్లలకు రాజ్ భవన్ లో ఓపెన్ హౌజ్

నేటి బాలలే రేపటి మన దేశానికి మంచి పేరు తెస్తారని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, వివిధ పాఠశాలల విద్యార్ధులకు గవర్నర్‌ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగ్జిబిషన్‌ ను ఆయన ప్రారంభించి.. స్టాల్స్‌ను పరిశీలించారు. వ్యవసాయంలో ప్రతి అంశం చిన్నారులకు తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ ఏడాది చిల్డ్రన్స్‌ డే సందర్భంగా ఏర్పాటు చేశామని గవర్నర్‌ తెలిపారు.