రాజ్యాంగం దేశానికి అమ్మలాంటిది

రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కు నివాళులర్పించారు ప్రధాని మోడీ. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్‌ నిర్వర్తించిన బాధ్యతలు వెల కట్టలేనిదన్నారు. రాజ్యాంగం దేశానికి అమ్మలాంటిదన్న ప్రధాని.. మహానీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మన్‌  కీ బాత్  లో  భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పలు అంశాలపై తనకు విధ్యార్థులు పంపిన లేఖలు ఆనందం కలిగించాయని చెప్పారు

ఇటు.. 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి మోడీ నివాళులర్పించారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా మారిందన్నారు. 40 ఏళ్లుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కుంటున్నామని చెప్పారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు భారత్‌ తగు చర్యలు చేపడుతుందన్న ఆయన.. ప్రపంచ దేశాలు తమతో కలిసి రావాలన్నారు. బుద్ధుడు, మహావీరుడు, గురునానక్‌, మహాత్మా గాంధీలు పుట్టిన ఈ గడ్డ అహింస, శాంతి మార్గంలో నడిచిందని చెప్పారు

ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా భారత ప్రజలందరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు మోడీ. అనంతరం రైతులకు పలు సూచనలు చేశారు. భూసార పరీక్షలను రైతులు నిర్వహించుకోడం సంతోషంగా ఉందన్న ఆయన.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు వేయాలని, దాంతో దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు.