రణరంగంగా మారిన కెన్యా

కెన్యా రణరంగంగా మారింది. అధికార, విపక్ష కార్యకర్తల ఆందోళనలతో అట్టుడుకుతోంది. కెన్యట్టా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన విపక్షాలు.. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తత ఘర్షణలకు దారి తీసింది. వెంటనే అలర్టయిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కెన్యట్టా దేశప్రజల్ని ఐక్యం చేస్తానని హామీ ఇచ్చారు.