రక్షణ రంగంలో మరో ఘన విజయం

భారతదేశం రక్షణ రంగంలో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బ్రహ్మోస్ సూపర్‌ సానిక్ క్రూయిజ్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. భారతీయ వాయుసేనకు చెందిన సుఖోయ్ – 30 ఎం.కె.ఐ ఫైటర్ జెట్ నుంచి దీనిని ప్రయోగించారు. ఈ మిసైల్ బరువు 2.4 టన్నులు. బంగాళాఖాతంలో ఈ ప్రయోగం జరిగింది. సుఖోయ్-30 ఎం.కె.ఐ ఫైటర్ జెట్ నుంచి బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్‌ను తొలిసారి ప్రయోగించి… భారతదేశం చరిత్ర సృష్టించింది. ఆకాశం నుంచి భూమిపైకి ప్రయోగించగల నాజూకైన బ్రహ్మోస్ మిసైల్స్ ను అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ బంకర్లపైనా, శత్రు ప్రాంతాల్లోని మారుమూల ఉగ్రవాద శిబిరాలపైనా దాడి చేయడానికి ఉపయోగించవచ్చు. 3 వేల 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది చేరుకోగలదని రక్షణ శాఖ పేర్కొంది. క్షిపణి ప్రయోగం విజయంతం పట్ల రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ హర్షం వ్యక్తంచేశారు. డి.ఆర్‌.డి.వొ శాస్త్రవేత్తలను అభినందించారు.