రక్తంతో రాస్తున్నాం..

పద్మావతి సినిమాను నిలిపివేయాలని రక్తంతో సంతకాలు చేశారు బ్రాహ్మణ మహాసభ నేతలు. జైపూర్ లో భారీ ఆందోళన నిర్వహించిన బ్రాహ్మణ మహాసభ నేతలు… పద్మావతి సినిమాను నిలిపివేయాలని సీబీఎఫ్‌సీకి రాసిన లేఖలపై రక్తంతో సంతకాలు చేశారు. రాణి పద్మిని జీవిత చరిత్రను వక్రీకరించేలా నిర్మించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే పద్మావతి సినిమాపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాణం వెనుక దావూద్ హస్తం ఉందని కర్ణిసేన నేతలు ఆరోపించారు. మరోవైపు, టైటిల్ రోల్ ప్లే చేసిన దీపికా పదుకొనే ముక్కు కోస్తామంటూ కర్ణిసేనకు చెందిన మహిపాల్ అనే యువకుడు బెదిరింపు వీడియో పోస్ట్ చేశాడు.