యూపీ సీఎం సభలో బురఖా విప్పించారు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్న ఓ బహిరంగ సభలో ముస్లిం మహిళకు చేదు అనుభవం ఎదురైంది. బురఖా తొడుక్కున్న ఆమె మిగతా మహిళలతో కలిసి స్టేజ్ ఎదుట కుర్చీల్లో కూర్చోవడంతో పోలీసులు ఆమె బురఖాను విప్పించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో… జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చారు. సీఎం యోగి దిశగా ఎవరూ నల్ల వస్త్రాలను చూపరాదన్న ఆదేశాలు ఉండటంతో… పోలీసులు అలా చేసి ఉంటారని సమర్థించుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి, చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం మీరట్‌లో జరిగిన ఓ సభలో కొందరు సీఎం యోగికి వ్యతిరేకంగా నల్ల జెండాలను చూపించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు వారిని చితకబాదారు. మళ్లీ అలాంటి ఘటన జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో బురఖాను విప్పించి ఉంటారని భావిస్తున్నారు.