యూపీ సీఎంతో బిల్ గేట్స్ భేటి

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ని కలిశారు. లక్నోలోని సీఎం ఆఫీసులో యోగితో భేటీ అయ్యారు. యూపీలో మిలిండా గేట్స్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరిలో జరగనున్న యూపీ గ్లోబల్ సమ్మిట్‌ పై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ తో బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడల్ విలేజ్‌ లో సహకారం అందించాలని బిల్‌ గేట్స్ ను రాజ్‌ నాథ్‌ కోరారు.