మైనారిటీలకు పెద్దమొత్తంలో రుణాలు

అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ పథకాలను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చెప్పారు. దీనిలో భాగంగా 2014-15లో 95 కోట్లు, 2015-16లో 95 కోట్లు, 2016-17లో 150 కోట్లు, 2017-18లో 150 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. గతంలో లోన్ల కోసం నాలుగైదు వేల దరఖాస్తులు మాత్రమే వచ్చేవని… తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షకు పైగా అప్లికేషన్లు దాఖలవుతున్నాయని వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సమాధానం చెప్పారు.