మైనారిటీలకు తెలంగాణలోనే ఎక్కువ బడ్జెట్

సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసేటప్పుడు అల్లాను కోరుకుంటున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. మైనారిటీల సంక్షేమంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. మైనారిటీ గురుకులాల్లో చదువుతున్న ముస్లిం విద్యార్థులు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థుల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూలుకు కూడా పంపించే స్తోమత లేని పేద ముస్లింలు గురుకులాల్లో చదువుతున్న తమ పిల్లలను సంతోషంతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.

తెలంగాణలో ఉన్న ముస్లింల పర్సెంటేజీ కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రాలు కూడా మైనారిటీల సంక్షేమానికి స్వల్పంగా నిధులు కేటాయిస్తున్నాయని షకీల్ వివరించారు. దేశంలో ఎక్కడా లేనంతగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ముస్లింలకు బడ్జెట్ కేటాయించారని కొనియాడారు. ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.