మెదక్ ఓడీఎఫ్ జిల్లా

మెదక్ జిల్లా సంపూర్ణ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా అవతరించింది. మంత్రి హరీశ్ రావు ఈ విషయం ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కంటే ముందు ఓడీఎఫ్‌ జిల్లాగా మెదక్‌ అవతరించినందుకు సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 వేల టాయిలెట్స్‌ నిర్మించడంపై అధికారులను అభినందించారు. మెదక్‌ కు జాతీయ రహదారి మంజూరు కావడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ రావు.. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, కలెక్టర్‌ భారతి హోళికేరి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.