మెట్రో ప్రయాణికులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

మెట్రో తొలి రోజే 2 లక్షల మంది హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో ప్రయాణించడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇవాళ కూడా భారీ స్పందన వస్తుండటంతో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మెట్రో అధికారులను ఆదేశించారు. అటు చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా మెట్రో అధికారులు, తోటి ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.