మెట్రోరైలులో గవర్నర్, కేటీఆర్ ప్రయాణం

హైదరాబాద్ లో పరుగులు పెట్టేందుకు మెట్రో రైలు సిద్ధం అయ్యింది. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్లు ఇప్పటికే ట్రయల్ రన్ నడుస్తోంది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మెట్రో రైలు అధికారులు ఇవాళ మెట్రోరైలులో ప్రయాణించారు. ఎస్సార్ నగర్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించి రైలుని, మెట్రో రైల్వేస్టేషన్లను పరిశీలించారు. మియాపూర్ లో మెట్రో రైలు డిపోను సందర్శించారు. అధికారులను అడిగి భద్రత, ఇతర పనుల వివరాలు తెలుసుకున్నారు.

ఈ నెల 28న హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి సమయం ఇస్తే ఆయన చేతుల మీదుగా మెట్రోరైలుని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో, ఇప్పటికే నాగోల్-మియాపూర్ లైన్ సిద్ధం చేశారు.