మూడు సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ పీడీ యాక్ట్ సవరణ బిల్లు, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టంలో సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం లభించింది. పీడీ యాక్ట్ సవరణ బిల్లుని సీఎం కేసీఆర్ తరఫున హోమంత్రి నాయిని ప్రవేశపెట్టారు. రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లుని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సవరణ బిల్లుని హోంమంత్రి నాయిని ప్రవేశపెట్టారు.

మంత్రికి బదులు అనధికార వ్యక్తిని చైర్మన్ గా నియమించేందుకు వీలు కల్పిస్తూ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చట్టంలో సవరణ తెచ్చారు. తెలంగాణ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు ప్రకారం.. 24 గంటల్లోనే వ్యాపారాలు ప్రారంభించే వీలు కల్పిస్తూ బిల్లును రూపొందించారు. దుకాణదారులు, సంస్థలు అప్లయి చేసుకున్న వెంటనే ప్రొవిజినల్ సర్టిఫికెట్ ఇచ్చేలా బిల్లులో మార్పులు చేశారు. ఆ తర్వాత 30 రోజుల్లో సంబంధిత అధికారి తనిఖీ చేసి తుది అనుమతి పత్రం ఇచ్చేలా వీలు కల్పిస్తూ సవరించారు.