ముస్లిం రిజర్వేషన్లు సాధించి తీరుతాం

వందశాతం ముస్లిం రిజర్వేషన్లను సాధించి తీరుతామన్నారు సీఎం కేసీఆర్. తమిళనాడు తరహాలో ముస్లింలకు రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. ఈ అంశంపై కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. రిజర్వేషన్లపై ఇప్పటికే ప్రధాని మోడీ కూడా సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మైనార్టీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. అటు ముస్లిం రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.