మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం

రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడారు. జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొనియాడారు. జీఈ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి మంత్రి కృతజ్ఞ‌తలు తెలిపారు.