మమతా బెనర్జీని కలిసిన కమల్‌హాసన్‌

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ కలిశారు. కోల్‌కతాలో జరుగుతున్న అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొనేందుకు వెళ్లిన కమల్‌…ప్రత్యేకంగా మమతాతో భేటీ అయ్యారు. త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు ప్రకటించిన కమల్‌ హాసన్‌…మమతా బెనర్జీని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే మర్యాద పూర్వకంగానే తాను మమతా బెనర్జీని కలుసుకున్నానని కమల్‌ తెలిపారు. మొదటి నుంచి మమతా బెనర్జీ అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు.