మన్మోహన్‌ కంటే మోడీనే బెటర్

దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గాన నడిపించడంలో ప్రధాని నరేంద్రమోదీనే బెటరని ఓ సర్వేలో తేలింది. మాజీ ప్రధాని మన్మోహన్‌, మోడీలలో ఎవరు ఉత్తమం అనే విషయంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. ఆంగ్లపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ నిర్వహించిన ఫేస్‌బుక్‌ సర్వేలో మోడీకి 69శాతం మంది మద్దతు తెలపగా, మన్మోహన్‌ కు కేవలం 31శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. మూడు లక్షల మంది పోలింగ్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.