మంత్రి కేటీఆర్ వరంగల్ టూర్ ప్రారంభం

మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటన ప్రారంభం అయ్యింది. వరంగల్ వెళ్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ లో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం వరంగల్ వెళ్లారు.

వరంగల్ కలెక్టరేట్ దగ్గర బస్ బే ని మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత నయీంనగర్ లో అండర్ గ్రౌండ్ గార్బేజ్ బిన్లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాల్లో గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ఆరూరి రమేశ్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ,  పలువురు ప్రజా ప్రతినిధులు, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.