మంత్రి కేటీఆర్ తో ఢిల్లీ డిప్యూటీ సీఎం భేటి

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా నేతృత్వంలో వచ్చిన బృందం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించింది. మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు వారికి స్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో మనీష్‌సిసోడియా బృందం సమావేశం అయ్యింది. ఢిల్లీలో టీ-హబ్ తరహా ప్రాజెక్టు ఏర్పాటు క్రమంలో మనీష్‌సిసోడియా మంత్రి కేటీఆర్‌తో చర్చించారు.

ఆ తర్వాత మనీష్‌సిసోడియా బృందం గచ్చిబౌలిలోని టీ-హబ్‌ను సందర్శించింది. మనీష్‌సిసోడియాతోపాటు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్, పలువురు ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు.