భావి పౌరుల కోసం ఎంతైనా ఖర్చు పెడతాం

భావి తెలంగాణ పౌరుల బంగారు భవిష్యత్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. పిల్లల సంరక్షణ, విద్య కోసం అనేక నిధులు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల, ఎంపీ దత్తాత్రేయ, ఉమెన్ కో ఆపరేటివ్ కార్పోరేషన్ ఛైర్మన్ గుండు సుధారాణి, శిశు సంక్షేమ శాఖ ఎండీ విజయేంద్ర బోయి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హరితహారంపై శిశు విహార్ విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.