భారత్ లో భారీ ఉగ్రదాడికి ఐసిస్ వ్యూహం

భారత్ లో భారీ విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉప రాష్ట్రపతి, ప్రధానితో పాటూ పలువురు బీజేపీ కీలక నేతలు టార్గెట్ గా దాడులు నిర్వహించే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారీ బహిరంగ సభల్లో దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందని, దీంతో  గుజరాత్ ఎన్నికల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరించింది. చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈశాన్య భారత్ తో ఆర్మీ నిఘా పెంచింది. ఉగ్రవాదుల టార్గెట్ లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీతో పాటూ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, సుష్మా, జైట్లీ, సీఎంలు పారికర్, యోగీ ఆదిత్యానాథ్ కూడా ఉన్నట్లు ఐబీ తెలిపింది.