భారత్ పై అమెరికా తీవ్ర ఆరోపణలు

ఇండియాపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. భారత్ లో మత స్వేచ్ఛ లేదంటూ సంచలన ప్రకటన చేసింది. ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లకు రక్షణ లేదని పేర్కొన్నది. అంతేకాదు.. ఇండియాలో మత స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు 5లక్షల డాలర్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఎన్జీవోలకు అందజేయనున్నారు. దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన, కార్మికుల రక్షణతో పాటు 28 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ప్రకటించిన అమెరికా.. ఇందుకోసం 17 మిలియన్‌ డాలర్లు కేటాయించామని తెల్పింది. ఐతే, అమెరికా నిధులు అందజేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ లేకపోయినా.. పెద్ద ఎత్తున ఫండ్స్‌ విడుదల చేయడం విమర్శలకు దారితీస్తోంది.