బీజేపీ నుంచి వైదొలిగిన సూరజ్‌ పాల్‌

 

పద్మావతి సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణ బీజేపీ నేత సూరజ్‌పాల్‌ అమూ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ హరియాణా మీడియా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన ఇక పార్టీ పదవుల్లో కూడా కొనసాగేది లేదని తేల్చిచెప్పారు. పద్మావతి వివాదం నేపథ్యంలో… ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోన్‌ తలలు నరికితే పదికోట్ల రూపాయలు ఇస్తానని సూరజ్‌పాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ…సూరజ్ పాల్‌ కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఐతే ఈ నోటీసులు పెద్దగా పట్టించుకోని సూరజ్‌ పాల్…హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ కట్టర్ పై విమర్శలు గుప్పించారు. ఆయన లాంటి సీఎం ను ఎక్కడా చూడలేదని ఫైరయ్యారు. కార్యకర్తలకు కట్టర్‌ కనీస గౌరవం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.