బాహుబలి స్టంట్ చేయబోతే…

కేరళలో ఓ వ్యక్తి బాహుబలిలో ప్రభాస్ ఏనుగు ఎక్కే స్టంట్‌ ను అనుకరించబోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ తో అతను చేసిన స్టంట్‌ రివర్స్ అయ్యింది.  సినిమాలో హీరో ప్రభాస్‌ మాదిరిగా తొండంపై కాలు పెట్టి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని ఏనుగు ఈడ్చికొట్టింది. దీంతో అతను పది అడుగుల దూరం పడిపోయాడు. గజరాజు దెబ్బకి స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్చటంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఫ్రెండ్స్ ముందు ఫోజు కొట్టేందుకు ఆ వ్యక్తి ఫేస్‌ బుక్‌ లో లైవ్ పెట్టి మరీ ఈ స్టంట్ ప్రయత్నించాడు.