బయ్యారం ప్లాంటుపై కేంద్రం నిర్లక్ష్యం

బయ్యారంలో ఉక్కు ప్లాంట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ విమర్శించారు.  ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుపై ఆరు నెలల్లోనే కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నా.. 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రాజెక్టును అడ్డుకుంటోందని సీతారాం నాయక్ ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నారని, కేంద్రం స్పందించకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బయ్యారం ప్లాంట్ కోసం  పోరాడతామని హెచ్చరించారు.

మరోవైపు, కేంద్ర ఆయుష్ బోర్డ్ సభ్యులతో ఎంపీ సీతారాం నాయక్ భేటి అయ్యారు. రామప్ప, లక్నవరం, భద్రాచలంలో  హెర్బల్ గార్డెన్ పెట్టాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కోరారు. ఇందుకోసం దరఖాస్తు చేసి సంవత్సరం అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఔషధ మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సీతారాం అన్నారు.