ఫలక్ నుమా ప్యాలెస్ లో కేంద్ర ప్రభుత్వం విందు

గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు వచ్చిన ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఇవాంక, మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎంపీలు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీఈఎస్ ప్రతినిధులు విందుకు హాజరయ్యారు.