ప్రతి జిల్లాకు రెండు గురుకుల పాఠశాలలు

రాష్ట్రంలో ప్రతి జిల్లాకు రెండు గురుకుల పాఠశాలలు ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్, పదవ తరగతి ఫలితాలు తెలంగాణ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్‌ ముందుండాలని చెప్పారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. అందుకు కావాల్సిన సౌకర్యాలన్ని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే,.. ఎక్కువ మొక్కులు నాటి.. సంరక్షించిన గురుకుల పాఠశాలలకు బహుమతులు కూడా ఇవ్వనున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు.