పార్ధివ వాహనాల కార్యక్రమం చాలా గొప్పది

పార్థివ వాహనాల కార్యక్రమం గొప్పదన్నారు  వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 వాహనాల్లో ఉచితంగా భౌతికదేహాలను తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 14 వేల డెడ్‌ బాడీలను తరలించామన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రధానాసుపత్రుల్లో ఈ వాహనాలు సేవలందిస్తున్నాయని తెలిపారు.