పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక

పాకిస్థాన్‌ కు అమెరికా మరో షాకిచ్చింది. పాక్ ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారాన్ని నిలిపేస్తేనే అమెరికా, నాటో దళాలు సహాయం చేస్తాయని తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే విధానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని గట్టిగా హెచ్చరించింది. లేదంటే అంతర్జాతీయ సహకారం ఉండదని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మాటిస్‌ స్పష్టం చేశారు. బ్రస్సెల్స్‌  లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన.. దక్షిణాసియాలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రాంతీయ వాదం, పునరేకీకరణ వంటి అంశాలపై చర్చించారు.