పలు దేశాల అధినేతలతో ప్రధాని భేటి

ప్రధాని మోడీ ఫిలిప్పీన్స్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మనీలాలో జరుగుతున్న ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా ఆసియాన్ భాగస్వామ్య దేశాల నేతలతో ప్రధాని భేటీ అవుతున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశమైన మోడీ… ఇవాళ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జపాన్ ప్రధాని షింజే అబే, ఆస్ట్రేలియా ప్రధాని టర్న్ బుల్, బ్రూనే సుల్తాన్ హసనల్, వియత్నాం ప్రధానులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో భారత్ సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోడీ. జపాన్ తో వాణిజ్య ఒప్పందాలు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పై షింజే అబెతో ప్రధాని చర్చించారు.