పద్మావతి సినిమాపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం

పద్మావతి సినిమాపై మరో రాష్ట్ర ప్రభుత్వం నిషేదం విధించింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ సర్కారు ఈ మూవీ విడుదలపై బ్యాన్ విధించింది. తాజాగా రాజస్థాన్ గవర్నమెంట్ కూడా పద్మావతి సినిమా విడుదలను నిషేదించింది. సినిమాలో కొన్ని మార్పులు చేస్తేనే  విడుదల చేసేందుకు అనుమతిస్తామని ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్ లో పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో యూనిట్ పై దాడి జరిగింది. కర్ణిసేన ఈ మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అటు పద్మావతి మూవీకి మద్దతు తెలిపారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సినిమాపై కొన‌సాగుతున్న ఈ వివాదం చాలా దుర‌దృష్టక‌ర‌మ‌ని అన్న దీదీ.. స్వేచ్చని నాశనం చేసేందుకు ఓ రాజ‌కీయ పార్టీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని ప‌రోక్షంగా బీజేపీని విమ‌ర్శించారు. ఇప్పటికే ప‌ద్మావ‌తి చిత్రానికి స‌ల్మాన్, ఫ‌ర్హాన్ అక్తర్‌, ప్రకాశ్ రాజ్‌, ష‌బానా అజ్మీ, హాలీవుడ్ న‌టి రూబీ త‌మ మ‌ద్దతు తెలిపారు.