పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా రాజ్ పుత్ ల ఆందోళనలు

 

పద్మావతి సినిమాను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రాజ్ పుత్ లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ లో  కర్ణిసేన కార్యకర్తలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు. సూరత్ లో కర్ణిసేన, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించారు. సినిమా పేరుతో చరిత్రను వక్రీకరిస్తే సహించబోమన్నారు. అటు ముంబైలో అఖండ్  రాజ్ పుత్ సేవా సంఘ్ కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్ వహించిన పద్మావతి సినిమాలో దీపికా పదుకొనె లీడ్ రోల్ ప్లే చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్ నటించారు. అయితే ఈ సినిమాలో రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించేలా సీన్లు ఉన్నాయంటూ రాజ్ పుత్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.