‘పద్మావతి’ విడుదలపై స్టే పిటిషన్ తిరస్కరణ

పద్మావతి చిత్ర విడుదల వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది. చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ లాయర్ మనోహర్ లాల్ శర్మ వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ ఒకటిన విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. అలాగే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి.