పద్మావతిగా నటించినందుకు గర్వపడుతున్నా

ప్ర‌ముఖ ద‌ర్శ‌క, నిర్మాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించిన చిత్రంలో తాను టైటిల్ రోల్ పోషించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని దీపికా పడుకోనే పేర్కొంది.. త‌న కెరీర్ లో అత్యంత విలువైన రెండు సంవ‌త్స‌రాల కాలాన్ని ఆ మూవీ కోస‌మే కేటాయించ‌న‌ని తెలిపింది.ఈ  చిత్రంపై జరుగుతున్న అల్లర్లు, వివాదాలు, గొడవలను ఆమె తీవ్రంగా ఖండించింది. ఇది సిగ్గుపడాల్సిన విషయమని తేల్చేసింది. ఒక చిత్రంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకముందని చెప్పింది.  తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తన ముక్కు కోస్తామనే హెచ్చరికలు, చంపితే రూ. 5కోట్లు ఇస్తామన్న మాటలను దీపిక తేలిగ్గా కొట్టి పారేసింది.