‘పద్మావతి’కి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాణి పద్మిని జీవిత చరిత్రను వక్రీకరిస్తూ ఈ సినిమా తీశారంటూ వేలాది మంది రాజ్ పుత్ లు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. బెంగళూరులో రాజ్ పుత్ కర్ణి సేన ఆధ్వర్యంలో వేలాది మంది యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పద్మావతి మూవీ విడుదలను నిలిపివేయాలని, సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. అటు ఇప్పటికే ఉత్తరాదిన పద్మావతి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్‌ ల్లో రాజ్ పుత్ లు నిరసనలు తెలుపుతున్నారు.