పట్టాలు తప్పిన వాస్కోడిగామ ఎక్స్ ప్రెస్

ఉత్తర ప్రదేశ్  లో మరో రైలు ప్రమాదం జరిగింది. వాస్కోడిగామా  పాట్నా ఎక్స్‌ ప్రెస్‌  తెల్లవారుజామున బండా దగ్గర పట్టాలు తప్పింది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా..8 మందికి గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలు విరగడంతో ప్రమాదం జరిగినట్లు  అంచనా వేస్తున్నారు. మొత్తం 13 బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఇండియన్‌  రైల్వేస్‌  పీఆర్‌  ఓ అనిల్‌ సక్సేనా అన్నారు.