పంటల వ్యర్థాలు కాల్చడం వల్లనే కాలుష్యం

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ లకు చెందిన రైతులు పంటల వ్యర్థాలను కాల్చడం వల్లనే ఢిల్లీ గ్యాస్ చాంబర్ లా మారిపోయిందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు ఇప్పటికే భారీ వాహనాలకు అనుమతులు, భారీ భవనాల నిర్మాణాలు నిలిపివేశామన్నారు. అయినప్పటికీ… పొరుగు రాష్ట్రాల రైతులు పంటలు కాల్చడం ఆపకపోతే కాలుష్యం తగ్గే పరిస్థితి లేదన్నారు. దీనిపై ఆయా రాష్ట్రాల సీఎంలతో మాట్లాడేందుకు అపాయింట్ మెంట్ కూడా కోరినట్లు కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయాలన్నీ పక్కన బెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు పూనుకుంటేనే కాలుష్యం తగ్గుతుందన్నారు.