నెహ్రూకు కేంద్ర నేతల ఘన నివాళులు

భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని నెహ్రూ స్మృతి వనం వద్ద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. పార్లమెంట్ భవనంలో జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటం వద్ద లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, అనంత్ కుమార్, బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు కాంగ్రెస్ నేతలు, పలువురు ఎంపీలు నివాళులు అర్పించారు.