నిజాలపూర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి దత్తత గ్రామం మూసాపేట్ మండలం నిజాలపూర్ లో 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. మరో 70 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

నిజాలపూర్ మాదిరిగా రాష్ట్రంలోని గ్రామాలు ఆదర్శంగా నిలవాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. గ్రామంలో 100 శాతం పారిశుద్ధ్యం, ప్రగతి ఉందని ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యాలను నిజాలపూర్ లో ప్రజలు సాధించి చూపిస్తున్నారని, తెలంగాణ కలలు నిజం చేస్తున్న గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. నిజాలపూర్ గ్రామానికి వైద్య ఉప కేంద్రాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.