నాయీ బ్రాహ్మణులకు ఆధునిక క్షౌరశాలలు

నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సౌకర్యాలతో క్షౌరశాలల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నదని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు క్షౌరశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 100 శాతం సబ్సిడీతో క్షౌరశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇతర వృత్తుల్లోకి వెళ్లిన నాయీ బ్రాహ్మణులకు రూ. 20 కోట్లతో శిక్షణ ఇచ్చి నైపుణ్యం కల్పిస్తున్నామన్నారు. నాయీ బ్రాహ్మణ మహిళలకు ఉచితంగా బ్యూటిషీయన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని మంత్రి జోగు రామన్న వివరించారు.