నామినేషన్ వేసిన గుజరాత్ సీఎం

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నామినేషన్‌ దాఖలు చేశారు. తన సొంత పట్టణమైన రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ ఆయనకు మరోసారి సీటు కన్‌ఫర్మ్ చేయటంతో ఆయన ఇవాళ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు రూపానీ స్కూటర్‌ మీద రాజ్‌కోట్ నుంచి ర్యాలీగా తన మద్దతుదారులతో బయలుదేరారు. గుజరాత్‌ను పాలించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోందని… స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 45 ఏళ్లు కాంగ్రెస్ అన్ని అవకాశాలు అందిపుచ్చుకుందని అన్నారు. తరచు అల్లర్లు, అరాచకం సృష్టించటమే ఆ పార్టీకి అలవాటని విమర్శించారు. ప్రగతికి మారుపేరైనా మోడీకే మళ్లీ జనం పట్టం కట్టాలని ఆయన కోరారు.