నాపై బురద జల్లితే.. కమలంలా బయటకు వస్తా

ప్రత్యర్ధులు తనపై బురద జల్లితే…ఆ బురదలో నుండి కమలం లా బయటకు వస్తానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కచ్ ప్రాంతంలోని భూజ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. డోక్లాంలో చైనా సైన్యాన్ని ఎదుర్కునేందుకు ఒక పక్క భారత సేనలు రాత్రంబవళ్లు పహారా కాస్తుంటే…కాంగ్రెస్ నేతలు మాత్రం చైనా అంబాసిడర్ ను కలిశారన్నారు. కచ్ భూకంపం తర్వాత పట్టుదలతో ఈ ప్రాంతాన్ని తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు ప్రధాని.