నమిత పెళ్లి కుదిరిందట..!

హీరోయిన్ నమిత తన పెళ్లి వార్తను ధృవీకరించారు. 36 ఏళ్ల ఈ న‌టి తమిళ నటుడు వీరను వివాహం చేసుకోబోతున్నట్టగా తెలిపారు. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకారం తెలిపాయి. ఈ నెల 24న వీరి వివాహం జరగనుంది. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో నమిత, వీర తమ పెళ్లి గురించి తెలియజేశారు. వీరి వివాహం తిరుపతిలో జరగనున్నట్టు తెలిసింది. 2002లో సొంతం చిత్రం ద్వారా టాలీవుడ్‌ ప్రవేశించిన నమిత ఆ తర్వాత బిల్లా, సింహా వంటి చిత్రాల్లో, కొన్ని తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది. కమల్‌హాసన్‌ వ్యాఖ్యతగా వ్యవహించిన బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు.