ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయుకాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తారాస్థాయికి చేరింది. దట్టమైన పొగ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆర్కేపురం, రాజ్ పథ్ ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకుంది. అటు శివారు ప్రాంతాల్లో కూడా పొగ మంచు  కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పలు రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పది మీటర్లలోపు ఉన్న వాహనాలు కనిపించడం లేదు. దాంతో 4 రైళ్లు రద్దయ్యాయి. 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతోంది. ఇక హైవేపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.