దేశ చరిత్రలోనే హైదరాబాద్ మెట్రో అతి పొడవైనది

దేశ చరిత్రలో హైదరాబాద్‌ మెట్రో అతి పొడవైనదన్నారు మంత్రి కేటీఆర్‌. పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్ట్‌ నర్‌ షిప్‌ లో హైదరాబాద్‌ మెట్రో ప్రపంచంలోనే పెద్దదన్నారు. అధికారుల కృషి వల్లే హైదరాబాద్‌ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైందన్నారు కేటీఆర్‌. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయన్నారు. భవిష్యత్‌ లో ప్రజల డిమాండ్‌ ను బట్టి సమయాల్లో మార్పులు చేస్తామన్నారు. మెట్రో ధరలను ఎల్‌ అండ్‌ టీ ప్రకటిస్తుందన్నారు.