దావూద్ ఆస్తుల వేలం

కరుడుగట్టిన నేరస్తుడు దావూద్ ఇబ్రహింకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. ముంబైలో దావూద్ కు చెందిన మూడు భవనాలకు వేలం నిర్వహించారు. రూ. 11 కోట్లకు ఈ మూడు భవనాలను సైఫీ బుర్హానీ ట్రస్ట్ సొంతం చేసుకుంది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మూడు దావూద్ కు చెందిన ఆస్తులను కేంద్రం సీజ్ చేసింది. వాటిని గతంలో కూడా వేలం వేసినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. కొద్ది రోజుల ముందు దావూద్ కు చెందిన ఓ కారును వేలం వేశారు. అనంతరం దాన్ని తగులబెట్టారు. ప్రస్తుతం వేలం వేసిన భవనాల్లో ఒక రెస్టారెంట్ తో పాటు గెస్ట్ హౌస్ కూడా ఉంది. అయితే, గతంలో దావూద్ కారును కొని తగులబెట్టిన చక్రపాణి అనే వ్యక్తి దావూద్ రెస్టారెంట్ కొని, దాన్ని టాయిలెట్ గా మార్చాలనుకున్నారు. కానీ ఆక్షన్ లో దాన్ని సైఫీ బుర్హానీ ట్రస్ట్ దక్కించుకుంది.