ఢిల్లీ మున్సిపల్ అధికారులతో రాష్ట్ర బృందం భేటి

న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జీహెచ్‌ఎంసీ అధికారులు సమావేశం అయ్యారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ లో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్ జనార్ధన్ రెడ్డితోపాటు రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు పాల్గొన్నారు. స్వచ్ఛతపై ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. ఇదే అంశంపై తెలంగాణ ప్రతినిధుల బృందం కోసం ఎన్‌డీఎంసీ వీడియో ప్రజెంటేషన్ నిర్వహించింది. ఈ మీటింగ్ అనంతరం తెలంగాణ ప్రతినిధుల బృందం దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.