ఢిల్లీలో సరి-బేసికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరటంతో నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్‌ నగరంలో సరి-బేసి విధానానికి అనుమతిచ్చింది. నిన్న ఈ విధానానికి నో చెప్పిన గ్రీన్ ట్రిబ్యునల్‌… తాజాగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఐతే, ఈ విధానాన్ని అమలు చేసేందుకు పలు కండిషన్లు పెట్టింది. ఫైరింజన్లు, అంబులెన్సులు, చెత్తను తీసుకెళ్లే వాహనాలకు మాత్రమే ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలు, మహిళలు, ప్రభుత్వాధికారులకు సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనను ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఎవరికీ మినహాయింపు ఇవ్వవద్దని స్పష్టం చేసింది. కాలుష్యం స్థాయి 300 దాటిన ప్రతిసారి ఆడ్‌-ఈవెన్ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. ఇన్నాళ్లు ఈ విషయంలో ఎందుకు అలసత్వం ప్రదర్శించారని ఢిల్లీ ప్రభుత్వంపై ఎన్‌.జి.టి ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఈ నెల 15 కు వాయిదా వేసింది. ఎన్జీటీ ఆదేశం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.