ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం, పొగ మంచు ఇంకా తగ్గలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించనంతగా… పొగ కమ్ముకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్యం కొంత అదుపులోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో కంట్రోల్ లోకి రాలేదు. అటు పొగ మంచు కారణంగా ఏడు రైళ్లు రద్దయ్యాయి. 27 ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మార్నింగ్ వాకర్లు మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. ఇక స్కూళ్లకు వెళ్లే పిల్లలకు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణపై హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ తో  చర్చించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చంఢీగఢ్ వెళ్లారు.