ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్య తీవ్రత

ఢిల్లీలో వాయి కాలుష్య తీవ్రత ఇంకా తగ్గలేదు. తెల్లవారు జాము నుంచి పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం, పొగ మంచు కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్‌ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అటు మార్నింగ్ వాకర్స్ మాస్క్ లు ధరించి బయటకు వస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సహా ఉత్తరాదిలో పెరిగిపోతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ, యూపీ, పంజాబ్‌, హర్యానాల్లో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిన్న ఆదేశాలు జారీ చేసింది.